
భద్రాచలం, వెలుగు: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా జేగురుగొండ, బెజ్జి పోలీస్స్టేషన్ల పరిధిలో మంగళవారం డీఆర్జీ, కోబ్రా 201, సీఆర్పీఎఫ్ 150 బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్‌లో 19 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. జేగురుగొండలో 14 మందిని, బెజ్జిలో ఐదుగురిని పట్టుకున్నారు. వీరిలో ముగ్గురిపై రూ.3లక్షల చొప్పున రివార్డు ఉంది. సుక్మా జిల్లాలో జరిగిన అనేక హింసాత్మక ఘటనల్లో వీరంతా పాల్గొన్నారు. మావోయిస్టులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చౌహాన్ తెలిపారు.